![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -995 లో.. రిషి లేడని మహేంద్ర బాధపడుతుంటాడు. డ్రింక్ చెయ్యబోతుంటే అప్పుడే అనుపమ వచ్చి ఆపుతుంది. రిషి లేడని మహేంద్ర తన బాధని అనుపమకి చెప్పుకుంటాడు. ఆ బాధతో నేను ఉండనంటు తన తలని చెట్టుకేసి బాదుకుంటాడు. అనుపమ మహేంద్రని ఆపుతుంది. నువ్వు వసుధార కోసం అయిన దైర్యంగా ఉండాలి. తన వెనకాల ఉండి నడిపించాలని మహేంద్రకి అనుపమ చెప్పి ఇంటికి తీసుకొని వెళ్తుంది.
ఆ తర్వాత వసుధార దగ్గరకి రాజీవ్ వస్తాడు. అక్కడే చక్రపాణి ఉంటాడు. రాజీవ్ రావడం చూస ఇద్దరు షాక్ అవుతారు. నీతో మాట్లాడాలని చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్నాను మావయ్య అని చక్రపాణితో రాజీవ్ అనగానే.. తను కోప్పడతాడు. అసలు ఎందుకు వచ్చావంటు రాజీవ్ పై మండిపడతాడు. రిషి సర్ లేడు కదా.. నిన్ను ఓదార్చడానికి వచ్చానని వసుధారతో రాజీవ్ అంటాడు. అసలు రిషి సర్ ఫోటో ఎక్కడ ఉంది.. కన్పించడం లేదు.. ఏంటి ఫోటోకి దండ వేసి దీపం పెడుతారు కాదా అని రాజీవ్ అనగానే.. వసుధార కోప్పడుతుంది. రిషి సర్ క్షేమంగా ఉన్నారు.. త్వరలోనే వస్తారని వసుధార దైర్యంగా చెప్తుంది. ఎక్కడ ఉన్నారు రమ్మను అని రాజీవ్ అంటాడు.
ఆ తర్వాత వసుధార, చక్రపాణీలకి కోపం వచ్చేలా రాజీవ్ మాట్లాడతాడు. వాడు ఇంట్లో లేడేంటి..వాడే మొన్న నిన్ను కాపాడడానికి వచ్చినవాడు ఎవడు వాడని వసుధారని రాజీవ్ అడుగుతాడు. నాకు తెలియదు నీకు తెలియని వాళ్ళు కూడా నీకు హెల్ప్ చేస్తున్నారా అని రాజీవ్ అంటాడు. రిషి సర్ లేడు కదా.. ఇంకా ఇక్కడ ఏంటి.. పదా నాతో వచ్చేయ్ అని వసుధార చెయ్యిని రాజీవ్ పట్టుకోబోతుంటే చక్రపాణి అడ్డుకుంటాడు.. ఆ తర్వాత రిషి ఫోటోకి రాజీవ్ దండ వెయ్యబోతుంటే వసుధార ఆపుతుంది. ఇక్కడ నుండి వెళ్ళు అంటు రాజీవ్ కి వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత మీకు దెబ్బ తాకింది కదా ఇప్పుడు ఎలా ఉంది.. బాగుండే ఉంటావ్ లే అని చక్రపాణితో రాజీవ్ అంటాడు. ఆ తర్వాత రాజీవ్ వెళ్ళిపోయాక ఇంతకు ముందు వీడు నిన్ను కలిశాడా అని వసుధారని చక్రపాణి అడుగుతాడు. ఇదివరకు రాజీవ్ కలిసిన విషయం చెప్తుంది. కాసేపటికి అనుపమ, మహేంద్ర ఇద్దరు ఇంటికి వస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |